‘పార్టీల భవితవ్యాన్ని తేల్చేది బీసీలే’

YSRCP To Hold BC Garjana Sabha In Eluru On Feb 17 - Sakshi

17న ఏలూరులో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన

బీసీలకు మేలు చేసింది దివంగత నేత వైఎస్సారే

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు

సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ఎన్నికల్లో పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించేది బీసీలేనని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరులో ఫిబ్రవరి 17న నిర్వహించనున్న బీసీ గర్జన సభ ఏర్పాట్ల విషయాలను ఆయన మంగళవారం మీడియాతో పంచుకున్నారు. ఈ సభను విజయవంతం చేస్తామన్నారు. బీసీల్లోని 134 కులాల ఇబ్బందులను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారని, వాటిని అధిగమించేటట్లు బీసీ డిక్లరేషన్‌ ఇస్తారని తెలిపారు.

బీసీ డిక్లరేషన్‌తో వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టిబోతున్నారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డినేనన్నారు. వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర దేశ చరిత్రలోనే ఏ నాయకుడు చేయలేదన్నారు. బీసీలకు మేలు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బీసీల పార్టీని చెప్పుకుంటూ మోసం చేయడం తప్ప, చేసిందేమి లేదని మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరగాలంటే జగనే సీఎం కావాలని ఆకాంక్షించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top