
పాదయాత్రలో వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం చిన్నారికట్ల శివారు నుంచి ఆయన 98వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అక్కడ నుంచి చిన్నారికట్ల, చిన్నారికట్ల జంక్షన్, కంభాలపాడు మీదుగా పోతవరం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. మూడు గంటలకు పొదిలి చేరుకొని అక్కడి ప్రజలతో జగన్ మమేకం కానున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.