ఓర్వకల్లు చేరుకున్న వైఎస్‌ జగన్‌

YS jagan mohan reddy reached Orvakal - Sakshi

సాక్షి, ఓర్వకల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  పాణ్యం నియోజకవర్గం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. కాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు.

ఆయన 2017 నవంబరు 14 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు మొత్తం 18 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. 14 నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నడక సాగించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఎన్నికల శంఖారావాన్ని పాణ్యం నియోజకవర్గంలో పూరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top