అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్‌ | Yes, I am a Pakistani, Says Adhir Ranjan Chowdhury | Sakshi
Sakshi News home page

అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్‌

Jan 16 2020 2:41 PM | Updated on Jan 16 2020 4:07 PM

కాంగ్రెస్‌ నేత  అధీర్‌ రంజన్‌ చౌదరి (ఫైల్‌ ఫోటో) - Sakshi

సాక్షి, కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీపై భారతీయ జనతా పార్టీపై  కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సీఏఏ, ఎన్నార్సీ అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.  గురువారమిక్కడ నార్త్‌ 24 పరగణా జిల్లా బషీర్‌హట్‌లో ర్యాలీలో పాల్గొన్న అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ...‘అవును, నేను పాకిస్తానీని. బీజేపీ ఏం చేసుకుంటుందో చేసుకోమనండి. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. 

‘రంగా, బిర్లా’లు ఢిల్లీలో కూర్చుని ఏం చెప్పినా మేము ఆమోదించాలా? లేకుంటే మాపై దేశద్రోహులని ముద్ర వేస్తారా అని మండిపడ్డారు. భారతదేశం నరేంద్రే మోదీ, అమిత్‌ షా వ్యక్తిగత ఆస్తి కాదని విమర్శలు గుప్పించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్ ధన్‌‌ఖర్‌పై మండిపడ్డారు. గవర్నర్‌కు పూర్తిగా మతిస్థిమితం తప్పిందని పదునైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) భూభాగం భారత్‌ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

చదవండి:

సీఏఏపై వెనక్కి తగ్గం

ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు

కాంగ్రెస్కు షాకిచ్చిన విపక్షాలు..!

జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు!

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే...

సీఏఏపై కేరళ సంచలన నిర్ణయం

సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement