‘చంద్రబాబు, పవన్‌ డ్రామాలు ఆడుతున్నారు’ | Vishnu Vardhan Reddy Slams Chandrababu And Pawan | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, పవన్‌ డ్రామాలు ఆడుతున్నారు’

Oct 31 2019 6:51 PM | Updated on Oct 31 2019 6:57 PM

Vishnu Vardhan Reddy Slams Chandrababu And Pawan - Sakshi

సాక్షి, విజయవాడ : ఇసుకపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. గురువారం విజయవాడలో ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌, చంద్రబాబువి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బహిష్కరించిన పార్టీ అని అన్నారు. టీడీపీ, జనసేన వేదికను తమ పార్టీ పంచుకోదని స్పష్టం చేశారు.

సునీల్‌ దేవ్‌ధర్‌ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడుకు శాశ్వతంగా తలపులు మూసేశామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉన్న ఏ వేదికను తాము పంచుకోమని అన్నారు. చంద్రబాబు మళ్లీ తమ వద్దకు రావాలని చూస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement