
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర బీజేపీలో అసమ్మతి సెగ రగిలింది. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల ఖరారు లో జనసేన-బీజేపీ పొత్తు తో బీజేపీ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిల్లి శ్రీరామమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా పార్టీ కు సేవ చేస్తున్నా 57 వ వార్డుకు తనను కాదని జనసేన కు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమై దాడులు)
జాబితా ప్రకటించక ముందే 57వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున శ్రీరామమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు బీజేపీ- జనసేన సంయుక్తంగా అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని బీజేపీ నేతలు చెప్పటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి బీజేపీకి సేవ చేస్తే.. తనను ఏమి చేసావంటూ మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించడం పట్ల శ్రీరామమూర్తి అసహనం వ్యక్తం చేశారు. (బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా)