ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి

Vijayasai Reddy made AP special representative in Delhi - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయసాయి రెడ్డికి కేబినెట్‌ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ‍్రహ్మణ్యం శనివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ భవన్‌ కార్యాలయంగా విజయసాయి రెడ్డి విధులు నిర్వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉంటూ సంస్థాగత నిర్మాణంలోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. 

‘నవరత్నాలు’కు ప్రత్యేక అధికారి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలుకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.శామ్యూల్‌ నవరత్నాల మానిటరింగ్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నవరత్నాలు అమలు శాఖలను సమీక్షించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా వ్యవహరించనున్న శామ్యూల్‌కు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top