ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు క‌న్నా? | Vijaya Sai Reddy Criticized Kanna Laxmi Narayana | Sakshi
Sakshi News home page

క‌న్నా లేఖ‌పై విజ‌య‌సాయి రెడ్డి ఫైర్‌

Jul 20 2020 7:57 AM | Updated on Jul 20 2020 12:29 PM

Vijaya Sai Reddy Criticized Kanna Laxmi Narayana - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు వ్య‌తిరేకంగా బీజేపీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాయ‌డంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. ఈమేర‌కు సోమ‌వారం త‌న ట్విట‌ర్ ఖాతాలో.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చంద్ర‌బాబు కోవ‌ర్టు అని మ‌ళ్లీ స్ప‌ష్ట‌మైంద‌ని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్య‌తిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజ‌ధాని బిల్లు ఆమోదించ‌వ‌ద్ద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశార‌ని విమ‌ర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్ర‌హానికి గుర‌య్యార‌ని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు క‌న్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!)

చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..)

Advertisement
 
Advertisement
Advertisement