
చింతలపాలెం(హుజూర్‌నగర్): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్‌ఎస్ కూడా హుజూర్‌నగర్ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.