కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి శాపం: ఉత్తమ్‌

Uttam Kumar Reddy Fires On TRS Govt And CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్‌ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి టెండర్లలో అన్నీ అవకతవకలేనని ఆరోపించారు. కమీషన్లతోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. పాలమూర్ జిల్లాకు కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదని అన్నారు. పాలమూరులో జరిగిన అభివృద్ది కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని స్పష్టం చేశారు. 

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తమ ఘనత అని టీఆరెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలవడం ఖాయమని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని తెలిపారు. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు మద్దతుధర కల్పిస్తామని, రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ..నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top