రక్షణ కల్పించలేం: అయోధ్య పర్యటన రద్దు! | Uddhav Thackeray Cancel Ayodhya Visit Source | Sakshi
Sakshi News home page

ఠాక్రే అయోధ్య పర్యటన రద్దు!

Nov 18 2019 1:46 PM | Updated on Nov 18 2019 2:03 PM

Uddhav Thackeray Cancel Ayodhya Visit Source - Sakshi

సాక్షి, ముంబై: శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్య పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఈనెల 24న అయోధ్య రామమందిర నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తారని పార్టీ వర్గాల ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. ఠాక్రే అయోధ్యలో పర్యటిస్తారని తెలిపింది. అయితే ఠాక్రేకు తాము రక్షణ కల్పించలేమని, ఆయన పర్యటనకు అనుమతిని నిరాకరిస్తున్నామని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా తెలిపినట్లు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆయన బిజీగా ఉన్నాయని, ఆ కారణంతోనే అయోధ్య పర్యటన వాయిదా వేశారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. కానీ పార్టీ వర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement