హత్యల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ: వీహెచ్‌ | TS is No 1 in murders & lawlessness | Sakshi
Sakshi News home page

హత్యల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ: వీహెచ్‌

Feb 1 2018 4:33 AM | Updated on Sep 19 2019 8:28 PM

TS is No 1 in murders & lawlessness - Sakshi

ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు (వీహెచ్‌) విమర్శించారు. హత్యల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలుస్తోందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు. అయినా గవర్నర్‌కు ఏం పట్టడం లేదని.. ప్రభుత్వానికి భజన చేయడమే ఆయన పనిగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ అరాచకంలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాస్తానని వీహెచ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement