breaking news
number one in state
-
హత్యల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు (వీహెచ్) విమర్శించారు. హత్యల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు. అయినా గవర్నర్‌కు ఏం పట్టడం లేదని.. ప్రభుత్వానికి భజన చేయడమే ఆయన పనిగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అరాచకంలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని వీహెచ్ చెప్పారు. -
రాష్ట్రంలోనే అగ్రస్థానం
అనంతపురం సెంట్రల్ : పన్ను వసూలు, రిజిస్ర్టేషన్లలో ‘అనంత’ ఆర్టీఏ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... పన్ను వసూలులో గతేడాది కంటే 23.40 శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. ఏప్రిల్ 15 నుంచి నుంచి డిసెంబర్ 15 వరకూ మూడు త్రైమాసికాల్లో రాష్ర్టంలోనే జిల్లా ముందంజలో ఉందన్నారు. గతేడాది రూ. 85.39 కోట్లు వసూలు చేయగా ఈ ఏడాది రూ. 105.37 కోట్లు వసూలు సాధించినట్లు వివరించారు. వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం ద్వారా పన్నుల వసూలు చేయడం, జరిమానాలు విధించడం, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలకు వేలం నిర్వహించడం తదితర అంశాలన్నీ వృద్ధి సాధించేందుకు ఆస్కారం కలిగింది. చివరి త్రైమాసికంలో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టి జిల్లాను నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతామని ఆయన వివరించారు.