ఆయన వల్లే కాంగ్రెస్‌కు బ్రహ్మాండమైన మెజారిటీ | A Tremendous Majority For Congress Because Of Anjan Kumar Yadav | Sakshi
Sakshi News home page

ఆయన వల్లే కాంగ్రెస్‌కు బ్రహ్మాండమైన మెజారిటీ

Jun 3 2018 5:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

A Tremendous Majority For Congress Because Of Anjan Kumar Yadav - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌ : 2004లో అంజన్ కుమార్‌ యాదవ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండటం వల్లే కాంగ్రెస్‌ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..గత 4 ఏళ్లలో  కాంగ్రెస్‌ కొంత పట్టుకోల్పోయింది కానీ అంజన్ నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలు అన్ని పార్టీల వేడుకగా జరగాలి కానీ కేసీఆర్ సొంత వేడుకలా జరుపుతున్నారని ధ్వజమెత్తారు. మెట్రో ట్రైన్‌ కేసీఆర్‌ సాధించారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగా వైఎస్ఆర్, కేంద్రమంత్రిగా తాను మెట్రో సాంక్షన్ చేయించుకోగలిగామని తెలిపారు.

‘ కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. అది అక్రమ సంబంధం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా వినయం ప్రదర్శిస్తున్నారు. తన అవినీతిపై కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు. తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధర ఇప్పటికి డబుల్ ఉంది. అయినా ధర తగ్గటం లేదు. బీజేపీ నాయకులు మా చేతుల్లో ఏం లేదంటున్నారు. టాక్సులు పెంచి రేట్లు తగ్గించకుండా ప్రజలను మోదీ వంచిస్తున్నారు. మోదీ టాక్స్ టెర్రరిస్ట్, ఎక్సైజ్ టాక్స్ టెర్రరిస్ట్ లేకపోతే ఈ రేట్లు ఏంటి. 2019లో కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో మిగిలిన పక్షాలను కలుపుకుని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామ’ ని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement