దేశంలోనే అతి పెద్ద సంక్షోభం

Tpcc Uttam Kumar Reddy Suggests State And Central Government To Help Migrant Workers - Sakshi

వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీపీసీసీ సూచన

కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌పై వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల వల్ల దేశంలోనే అతి పెద్ద సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని మానవతా కోణంలో ఆలోచించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వలస కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులపై కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌పై చర్చించేందుకు టీపీసీసీ నేతలు ఆదివారం వీడియె కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘం కార్యదర్శి ఎం.రాఘవయ్య, ఇతర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో వలస కార్మికుల సమస్యలను సమన్వయం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను నియమించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top