breaking news
Shashidhar Reddy Marri
-
దేశంలోనే అతి పెద్ద సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల వల్ల దేశంలోనే అతి పెద్ద సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని మానవతా కోణంలో ఆలోచించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వలస కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులపై కోవిడ్–19 టాస్క్ఫోర్స్పై చర్చించేందుకు టీపీసీసీ నేతలు ఆదివారం వీడియె కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఎం.రాఘవయ్య, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో వలస కార్మికుల సమస్యలను సమన్వయం చేయడానికి టాస్క్‌ఫోర్స్ సబ్ కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను నియమించారు. -
తలసానీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: మర్రి
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులను వేధించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాఖ మార్చడం సంతోషకరమని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి హితవు పలికారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున తలసాని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి మంత్రి నుంచి ఆ శాఖను తీసేయడం ద్వారా వ్యాపారులకు మేలు చేసినట్లయిందన్నారు. లాతూర్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.