లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం | Telangana MPs Takes Oath In Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం

Jun 18 2019 1:46 PM | Updated on Jun 18 2019 3:33 PM

Telangana MPs Takes Oath In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో తెలంగాణకు చెందిన సభ్యులు మంగళవారం ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్‌ కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు ప్రమాణం చేశారు. 

వీరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వెంకటేశ్ నేత మాతృభాష తెలుగులో‌ ప్రమాణస్వీకారం చేశారు. బీబీ పాటిల్‌ హిందీలో, అసదుద్దీన్‌ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఇక అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంగ్లీష్‌ భాషలో ప్రమాణం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement