కాంగ్రెస్‌ తొలి జాబితా రెడీ

Telangana Elections 2018 Congress Party Candidates First List Is Ready - Sakshi

74 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడింది. 74 మంది అభ్యర్థులతో కూడిన తమ మొదటి జాబితాను మిత్రపక్షాల జాబితాలతో కలిపి శనివారం ఉదయం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14 స్థానా లు, తెలంగాణ జనసమితికి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. 94 స్థానాలకూ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థులను ప్రతిపాదించగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) 74 స్థానాలకు ఆమోదం తెలిపింది. మంగళ, బుధవారాల్లో పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు చొప్పున పేర్లను ప్రతిపాదించి సీఈసీకి పంపింది. సీఈసీ ఇదివరకే 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా గురువారం 17 స్థానాల్లో అభ్యర్థులను ఎంపి క చేసింది.

గురువారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో సీఈసీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యు లు ఏకే ఆంటోనీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, అహ్మద్‌ పటే ల్, వీరప్ప మొయిలీ, అంబికాసోనీ, అశోక్‌ గెహ్లాట్‌లతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్‌ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా, బోసురాజు మీడియాతో మాట్లా డారు. ‘‘పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 74 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.  మిగిలిన సీట్లపై సీఈసీ ఈనెల 11 లేదా 12న నిర్ణయం తీసుకుంటుంది. తొలి జాబితా ఈ నెల 10న హైదరాబాద్‌లో కూటమి పార్టీలతో కలిసి జాబితా విడుదల చేస్తాం’’అని తెలిపారు.

తెలంగాణ ఇంటి పార్టీకి ఎక్కడ? 
తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్, మునుగోడు, మహబూబ్‌నగర్‌ స్థానాలను కోరుతోంది. నకిరెకల్‌ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం అయినందున ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్‌ భార్య చెరుకు లక్ష్మి పోటీ చేయనున్నారు. చెరుకు సుధాకర్‌గౌడ్‌ మునుగోడు(జనరల్‌) ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నం శ్రీని వాస్‌రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ, ఆ స్థానంలో కాంగ్రెస్‌ లేదా టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

వివాదాస్పద సీట్లు పెండింగ్‌లో
భక్తచరణ్‌ దాస్‌ నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ 94 స్థానాలకూ అభ్యర్థులను ప్రతిపాదించినప్పటికీ సీఈసీ 74 స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికను ఆమోదించింది. మిగిలిన 20 సీట్లను (ఇందులో తెలంగాణ ఇంటి పార్టీకి 1 వెళు తుంది) పెండింగ్‌లో పెట్టింది. వీటిలో కొన్ని స్థానాలను సీపీఐ, మరికొన్ని స్థానాలను టీజేఎస్‌ ఆశి స్తుండడం.. ఒక్కోస్థానం నుంచి పోటీ తీవ్రంగా ఉండటం కారణంగా ఆయా స్థానాలను రెండో విడతలో వెలువరించనున్నారు. ఇప్పుడే ఆయా స్థానా లను ప్రకటిస్తే అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంటుందని, టీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలకు వలస వెళ్లే ప్రమాదం ఉందన్న వ్యూహంతో వీటిని పెండింగ్‌లో పెట్టినట్టు తెలు స్తోంది. మునుగోడు, పటాన్‌చెరువు, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, రాజేంద్రనగర్, నకిరేకల్, నాగర్‌కర్నూల్, తుంగతుర్తి, మహబూబ్‌నగర్, దేవరకొండ, కంటోన్మెంట్, వరంగల్‌ ఈస్ట్, ఎల్‌.బి.నగర్, బోథ్, ఆదిలాబాద్, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌తోపాటు మరో రెండు కీలక స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. 

రేవంత్‌ వర్సెస్‌ ఉత్తమ్‌ 
అభ్యర్థుల ఖరారు విషయంలో టీపీసీసీ ముఖ్య నేతల మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారని, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మా త్రం ఆ జాబితాను అసలు పరిగణనలోకే తీసుకోవద్దని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

09-01-2019
Jan 09, 2019, 11:29 IST
కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసిందంటూ...
27-12-2018
Dec 27, 2018, 20:20 IST
ఆయన ఆస్తి విలువ రూ. 500 కోట్లు
27-12-2018
Dec 27, 2018, 03:03 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ...
25-12-2018
Dec 25, 2018, 17:59 IST
గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ రాజ్‌భవన్‌లో వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
25-12-2018
Dec 25, 2018, 05:29 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ...
24-12-2018
Dec 24, 2018, 17:23 IST
చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేననూ అసలే నమ్మొద్దని ప్రజలకు
22-12-2018
Dec 22, 2018, 12:24 IST
విలువలు పాటిస్తున్న నాయకుడిని కాబట్టే ..
22-12-2018
Dec 22, 2018, 11:02 IST
వరంగల్‌ స్థానిక సంస్థల ద్వారా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ..
21-12-2018
Dec 21, 2018, 01:49 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ శాసనమండలి...
21-12-2018
Dec 21, 2018, 01:26 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన టీఆర్‌ఎస్‌ తాజాగా శాసనమండలి ఎన్నికలపై దృష్టి సారించింది....
21-12-2018
Dec 21, 2018, 00:59 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను...
21-12-2018
Dec 21, 2018, 00:35 IST
హుజూరాబాద్‌: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్‌ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో...
21-12-2018
Dec 21, 2018, 00:16 IST
సాక్షి, జనగామ/హన్మకొండ: ‘జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల్లో ప్రజలు మనవైపే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో...
20-12-2018
Dec 20, 2018, 09:42 IST
సాక్షి, మంథని:  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. ప్రభుత్వ విప్‌.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న...
19-12-2018
Dec 19, 2018, 19:25 IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసినా బీజేపీకి కలిసిరాలేదు.
19-12-2018
Dec 19, 2018, 17:58 IST
వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తారు. పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసింది.
19-12-2018
Dec 19, 2018, 16:24 IST
రాబోయే మూడు ఏళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం ..
19-12-2018
Dec 19, 2018, 14:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గడిబిడి జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు....
19-12-2018
Dec 19, 2018, 12:57 IST
‘ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుందంటూ...
19-12-2018
Dec 19, 2018, 02:32 IST
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతంపై టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top