
సాక్షి, హైదరాబాద్ : మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి కేసీఆర్ సభలో సమాధానమిచ్చారు. తామిచ్చిన హామీలపై ఆందోళన అవసరం లేదని, గత ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేసినట్లు ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ పథకాలు చాలా గొప్పవని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఈ పథకాలను అమలు చేసిన వైఎస్సార్‌ను అభినందించాల్సిందేనని, దాంట్లో ఎలాంటి భేషజాలు లేవన్నారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.