టీడీపీలో అలజడి; పవన్‌ మరిన్ని ట్వీట్లు! | TDP Worries On Pawan Kalyan Sensational tweets | Sakshi
Sakshi News home page

టీడీపీలో అలజడి; పవన్‌ మరిన్ని ట్వీట్లు!

Apr 20 2018 10:58 AM | Updated on Mar 22 2019 5:33 PM

TDP Worries On Pawan Kalyan Sensational tweets - Sakshi

విజయవాడ: నటి శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌, టీడీపీ అనుకూల మీడియా చానెళ్లు కలిసి తన కుటుంబంపై అత్యాచారం సాగిస్తున్నారని, డబ్బులిప్పించిమరీ తల్లిని దారుణంగా తిట్టించారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చజరినట్లు సమాచారం.

ఒక్కరోజు దీక్ష చేస్తోన్న చంద్రబాబు నాయుడు సైతం పవన్‌ వ్యాఖ్యలపై ఆరాతీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడొద్దని నేతలకు హుకుం జారీఅయినట్లు తెలిసింది. పవన్‌ చేసినవి అతితీవ్రమైన వ్యాఖ్యలు కావడంతో వాటిపై ఎలా స్పందిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయోనని టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. మాజీ మిత్రుడు పవన్‌ ఇంకా ఎలాంటి అంశాలను బయటపెడతాడోనని ఆందోళన చెందిన టీడీపీ నేతలు.. ఈ మేరకు మరిన్ని ట్వీట్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
(చదవండి: శ్రీరెడ్డి వివాదం; సంచలనం రేపిన పవన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement