టీడీపీకో దండం.. ఎమ్మెల్యే బీకే ఓ ఉన్మాది | TDP MPP padmavathi Resign in Anantapur | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బీకే ఓ ఉన్మాది

Feb 5 2019 1:32 PM | Updated on Feb 5 2019 1:32 PM

TDP MPP padmavathi Resign in Anantapur - Sakshi

జెడ్పీ డిప్యూటీ సీఈఓకు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న రొద్దం ఎంపీపీ పద్మావతమ్మ, టీడీపీ నాయకులు

అనంతపురం సెంట్రల్‌: పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నాడని ఆ మండల ఎంపీపీ పద్మావతి, పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎంపీపీ పద్మ తన పదవికి రాజీనామా చేశారు. తమ అనుచరులతో నేరుగా జిల్లా పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్న ఆమె తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణకు అందజేశారు. అనంతరం తన రాజీనామాకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు.  2017 నుంచి (18 నెలలు) ఎంపీపీగా కొనసాగుతున్నట్లు వివరించారు. రొద్దం మండలంలో తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారథి కక్షసాధింపు చర్యలతో వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని ఆరోపించారు. పేరుకు మాత్రం తాము ఎంపీపీ హోదాలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఉన్మాదిలా మారిన ఎమ్మెల్యే... మండల అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం ఎమ్మెల్యే అనుమతి లేనిదే ఇవ్వడం లేదన్నారు.

కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడన్నారు. జిల్లా పరిషత్‌లో కూడా ఎమ్మెల్యేలు లేఖలు ఉంటేనే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. అధికార టీడీపీ కన్నా గత కాంగ్రెస్‌ హయామే మేలని అన్నారు. చివరకు ఎంపీ నిమ్మలకిష్టప్ప తమను చేరదీయడాన్ని జీర్ణించుకోలేక మరింత వేధింపులకు గురి చేస్తూ వచ్చాడన్నారు. తమకు అనుకూలంగా వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలు ఉండడంతో ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే కార్యకర్తలు, నాయకులను కలుపుకుని జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఇకపై పనిచేస్తామం టూ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణ తమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్థసారథి సన్నిహితుడు సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యేది, తనది ఒకే ఊ రని, అయినా ఆయన వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డామని, పార్థసారథి వెన్నంటే ఉంటూ వచ్చామని వివరించారు. త్వరలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతామని ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, ఎంపీపీ భర్త అక్కులప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నాగరాజు, ఉపసర్పంచ్‌ ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.  

పార్థుడికి షాక్‌
రొద్దం:  మండలంలో టీడీపీని బలోపే తం చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి విజయంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత, ఎంపీపీ పద్మావతి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సందర్భంగా ఆమె భర్త అక్కులప్పతో పాటు తాజా మాజీ సర్పంచ్‌ నాగరాజు, ఎం.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, మాజీ సర్పంచ్‌ సి.నారాయణరెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు జెట్టి అంజినరెడ్డి, సీనియర్‌ నాయకుడు కొత్తపల్లి కురుబ తిప్పన్న, పలువురు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ..  నమ్మిన వ్యక్తులను, పార్టీ అ భ్యున్నతికి కృషి చేసే వ్యక్తులను ఎమ్మెల్యే పార్థసారథి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అక్కులప్ప మాట్లాడుతూ పార్థసారథిని నమ్మి ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసినట్లు తెలిపారు. ఓ క్రమంలో పార్టీ కోసం జైలుకు సైతం  వెళ్లినట్లు గుర్తు చేశారు. మండల అభివృద్ధిని అడ్డుకుంటు, ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కకుండా చేస్తున్న ఎమ్మెల్యే వైఖరితో విసుగు చెంది టీడీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితులై త్వరలో వైఎస్సార్‌ సీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement