‘17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం’

TDP MLAs Wants To Join In YSRCP Says Sajjala Ramakrishna Reddy - Sakshi

మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ జరిగింది

అన్ని వర్గాల సలహాల కోసమే వేచి ఉన్నాం

డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్లం కాదు

5 కోట్ల ప్రజల బాగుకోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారు

కుయుక్తులే చంద్రబాబు నైజం : ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, తాడేపల్లి : టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే ఉందని పేర్కొన్నారు. వాళ్లందరినీ తీసుకుని తామేం చేయాలని అన్నారు. అయినా, ​కోట్లు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని తెలిపారు. సీఎం జగన్‌ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
(చదవండి : ‘బాబుకు లోకేష్‌ భయం పట్టుకుంది’)

మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని సమయం ఇచ్చాం. ఎల్లో మీడియా ఆగడాలకు అంతులేదు. మండలిని ఎవరూ తక్కువ చేయడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని నిర్ణయాలతో సీఎం జగన్‌ ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోంది. రాజధానిని గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించినట్టు.. మండలి తమ చేతిలో ఉందని తామేదైనా చేస్తామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోంది.
(చదవండి :ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే)

చైర్మన్‌ను ప్రభావితం చేసి బాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. సామాన్య కార్యకర్తకంటే హీనంగా బాబు వ్యహరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను నియంత్రించడం దుర్మార్గం. ప్రజలు మీ గ్రాఫిక్స్‌ రాజధానిని నమ్మలేకే లోకేష్‌ని ఓడించారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు మావైపే ఉంది. అయినా, పద్ధతి ప్రకారం సీఎం జగన్‌ ముందుకెళ్తున్నారు’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

అమిత్‌ షా లైన్‌లోకి వచ్చారట..!
అమిత్‌షాతో మాట్లాడి మండలి రద్దును అడ్డుకుంటామని.. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెప్పారట. అమిత్‌షాతో మాట్లాడినట్టు స్పీకర్‌ ఆన్‌చేసి.. బాబు ఎవరితోనే మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్తున్నారు. 18 మంది ఎమ్మెల్సీలను బీజేపీలో పంపుతాను. రెండేళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కోరారట. అవతలి వ్యక్తి ఒక ఏడాది ఆపుతానని అన్నారట. మీతో అమిత్‌షా ఎందుకు లైన్‌లోకి వస్తారని టీడీపీ ఎమ్మెల్సీలు అడిగితే.. చంద్రాబాబు దగ్గర సమాధానం లేదట. ఒక సంవత్సరం ఆగితే మండలిలో మాకు మెజార్టీ వస్తుంది.
(చదవండి : చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా)

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారు..? రూ.5 కోట్లు, రూ.10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరమేముంది. శివరామకృష్ణన్‌ కమిటీని బాబు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బినామీ భూముల వ్యవహారం బయటపడుతుందనే.. అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. దళితులను భయపెట్టి చంద్రబాబు భూములను తీసుకున్నారు. లోకేష్‌ను ఓడించి, సీఎం జగన్‌ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని.. ఆ ప్రజలను మేం ఎట్లా విస్మరిస్తాం. అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. 

వైఎస్‌ జగన్‌కు బాబుకు అదే తేడా..!
5 కోట్ల ప్రజల ఆకాంక్షలకను నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబం, వారి కష్టనష్టాలు తనవి అనుకుని   సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు మాత్రం.. నాది, నా కుంటుంబం అనుకుని రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు. ఎదురీదడం సీఎం జగన్‌ లక్షణం. ఆయన మరోసారి ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. నిజాయితీ, నిబద్ధత ఆయన నైజం. మనీ, మీడియా, మ్యానిప్యులేషన్‌ ఇవి చంద్రబాబు లక్షణాలు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం చంద్రబాబు నైజం. ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. 

చంద్రబాబు చీకటి అయితే.. సీఎం వైఎస్‌ జగన్‌ వెలుగు. ప్రజా సంక్షేమం, అభివృద్ధితో కలిపి రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌లో ఉంచాలన్నదే ఆయన ధ్యేయం. చంద్రబాబుకు అధికారం ఇచ్చినా నిలుపుకోలేకపోయారు. ఎల్లో మీడియా కథనాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పొరపాటున కూడా డబ్బులిచ్చి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలు చేయరు. ప్రజా సంక్షేమానికి అందరం కలిసి పనిచేద్దాం’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top