వైఎస్సార్‌ సీపీలోకి భారీ చేరికలు

TDP Activists Join YSRCP In Jangareddygudem - Sakshi

సాక్షి, జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో టీడీపీకి షాక్‌ తగిలింది. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు వందనపు సాయి బాలపద్మ, పొల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌ పాలన చేశారని పేర్కొన్నారు.

ఎంతో మంది నాయకులు అవకాశాలు ఉంటేనే సేవ చేస్తారని.. కానీ సీఎం జగన్‌ అవకాశం కల్పించుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపటినప్పటి నుండి రోజుకోక పథకం ప్రవేశపెడుతున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. మహిళల కోసం మద్యపాన నిషేధం తో పాటు, బీసీ మహిళలకు చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జంగారెడ్డిగూడెం ను గ్రీన్ సిటిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ఆరు కోట్ల రూపాయలతో డ్రైయిన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top