సీఎం హత్య కేసు: మరణశిక్షను రద్దు చేయండి

Sukhbir  Singh Badal Meeting Union Home Minister Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బల్వంత్‌ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్‌లో అప్పటి ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 17 మంది మరణించారు. ఈ కేసులో బల్వంత్‌ సింగ్‌ దోషిగా తేల్చితూ 2007లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఆయనకు విధించిన శిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని బాదల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనిపై అమిత్‌ షా ఏవిధంగా స్పందించారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top