యూపీలో గఠ్‌బంధన్‌ హవా

SP-BSP Mahagathbandhan to Win 42 UP Seats in Lok Sabha Elections 2019 - Sakshi

బిహార్‌లో ఎన్డీయే పైచేయి

లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ–నీల్సన్‌ సర్వే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని గఠ్‌బంధన్‌ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని ఏబీపీ–నీల్సన్‌ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీపార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లతో కూడిన గఠ్‌బంధన్‌ (కూటమి) 42 స్థానాలు గెలుచుకోవచ్చనీ, బీజేపీ, అప్నాదళ్‌ కూటమికి 36 సీట్లు రావచ్చని ఆ సర్వే పేర్కొంది.

ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 5, కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకున్నాయి. బిహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్డీయేకు 34, గఠ్‌ బంధన్‌కు 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. యూపీలో సీట్లు తగ్గినా బీజేపీ కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, గఠ్‌బంధన్‌ కంటే ఎక్కువగా (43శాతం) ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం కూడా 7.8(2014) నుంచి 9 శాతానికి పెరగొచ్చని పేర్కొంది.

మార్చి16–24వ తేదీల మధ్య 20వేల మందికిపైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని సర్వేలో మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు మోదీ తీరు ఏవరేజ్‌గా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుకు ఓటర్లు 3.73 మార్కులు ఇచ్చారు. అవినీతి, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశాలని మెజారిటీ ఓటర్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే వారికే ఓటేస్తామని అత్యధికులు స్పష్టం చేశారు. మత సామరస్యం, ధరల నియంత్రణ, వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని సర్వే నివేదిక పేర్కొంది.

బిహార్‌లో 34 సీట్లు..
బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్, లోక్‌జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీయే 52 శాతం ఓట్లతో 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని నీల్సన్‌ సర్వే పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయలోక్‌ సమతా పార్టీ, సీపీఐ (ఎంఎల్‌)తో కూడిన గఠ్‌బంధన్‌కు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మార్చి 17–26 మధ్య పది వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు నీల్సన్‌ సంస్థ పేర్కొంది.
ఇక్కడ కూడా మోదీ పనితీరు బాగుందని, నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే పనితీరుకు 3.92 మార్కులు ఇచ్చారు. ఇక్కడ కూడా అవినీతి, నిరుద్యోగం ప్రజల ప్రధాన సమస్యలని సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరడం మంచిదేనని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, తప్పు నిర్ణయమని 39 శాతం వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు

26-05-2019
May 26, 2019, 14:21 IST
ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని..
26-05-2019
May 26, 2019, 14:17 IST
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బెజవాడ...
26-05-2019
May 26, 2019, 13:44 IST
ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..
26-05-2019
May 26, 2019, 12:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
26-05-2019
May 26, 2019, 12:52 IST
కనీవినీఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సంబంధాలను చరమాంకంలోకి నెట్టింది. విజయంతో అన్నింటినీ సర్దుబాటు చేయవచ్చని ఆశించినా అలా...
26-05-2019
May 26, 2019, 12:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. విభజన హామీలను నెరవేర్చాలని,...
26-05-2019
May 26, 2019, 11:30 IST
‘రాహుల్‌ రాజీనామా డ్రామా’
26-05-2019
May 26, 2019, 10:02 IST
అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ హయాం లో...
26-05-2019
May 26, 2019, 09:50 IST
భీమవరం(ప్రకాశం చౌక్‌): 2009లో మెగాస్టార్‌ చిరంజీవిపై, ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై పందేలు కాసి జిల్లాలోని యువత రూ.కోట్లలో నష్టపోయారు. అప్పట్లో చిరంజీవి...
26-05-2019
May 26, 2019, 09:27 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న జిల్లాలో పార్టీ ఈ స్థాయిలో పతనం చెందడానికి...
26-05-2019
May 26, 2019, 08:33 IST
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్లపాటు నరకం అనుభవించాం.. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లేదు, గొంతెత్తి మాట్లాడితే సస్పెన్షన్‌లు, ఆందోళన చేద్దామని రోడ్డు...
26-05-2019
May 26, 2019, 08:11 IST
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్‌ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో...
26-05-2019
May 26, 2019, 07:54 IST
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబర్చింది. 2014 ఎన్నికల్లో...
26-05-2019
May 26, 2019, 06:33 IST
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ...
26-05-2019
May 26, 2019, 06:12 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్‌...
26-05-2019
May 26, 2019, 06:05 IST
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని  ప్రారంభిస్తుందని  ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు....
26-05-2019
May 26, 2019, 05:39 IST
కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో బీజేపీదే పైచేయి అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు మరోసారి నిరూపించాయి. యూపీలోని అమేథీలో స్వయంగా కాంగ్రెస్‌...
26-05-2019
May 26, 2019, 05:32 IST
ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు....
26-05-2019
May 26, 2019, 05:21 IST
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్‌ బంధన్‌)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ...
26-05-2019
May 26, 2019, 05:13 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసింది. 17వ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top