ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్‌..! | Somireddy Chandramohan Reddy Brother in law Joined In YSRCP | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్‌..!

Jan 23 2019 12:18 PM | Updated on Jan 24 2019 8:04 AM

Somireddy Chandramohan Reddy Brother in law Joined In YSRCP - Sakshi

వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన రామకోట సుబ్బారెడ్డి తదితరులు..

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. ఆయన సొంత బావ కేతిరెడ్డి రామకోటారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో రామకోటారెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కేంద్రకార్యాలయం లోటస్‌పాండ్‌లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. రామకోటారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకోటారెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరి భర్త. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement