‘లగడపాటి ఓ జోకర్‌’

Somarapu Satyanarayana Slams Lagadapati Rajagopal Survey - Sakshi

రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ

సాక్షి, రామగుండం(పెద్దపల్లి): తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసినా.. నాయకుల మధ్య మాటల యుద్దం ఆగటం లేదు. విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే మినహా అన్ని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ఫోల్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే లగడపాడి రాజగోపాల్‌ మాత్రం మహాకూటమి అధికారంలోకి రాబోతోందని, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని తన సర్వేలో తేలినట్లు వివరించారు. రామగుండంలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ కోరుకంటి చందర్ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు.

లగడపాటికి సోమారపు సవాల్‌
దీంతో లగడపాటి సర్వేపై రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన లగడపాటి ఒక జోకర్‌ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామగుండంలో కూడా టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ‘నీవిచ్చిన సర్వే నిజమైతే హైదరాబాద్‌లో బట్టలు విప్పుకొని తిరుగుతా? నీ సర్వే అబద్దమైతే నువ్వు బట్టలిప్పుకొని తిరగాలి’అంటూ లగడపాటికి సోమారపు సత్యనారాయణ సవాల్‌ విసిరారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top