
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8 వేలు ఇస్తున్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాలను రైతులే బొంద పెట్టడం తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రైతులను గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు, సాగుకు పెట్టుబడి, గిట్టుబాటు ధర వరకూ అన్ని సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా, రైతు బాంధవునిగా పనిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు వద్దని ప్రతిపక్షనేతలు అనగలరా అని ప్రశ్నించారు.