ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది..!

Social Media Satires On Chandrababu Naidu Over National Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంద్రప్రదేశ్‌ ప్రజలు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ విజయం అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి భారీ వైఫల్యాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. ఇక నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుని తిరిగిన చంద్రబాబు పాచికలు ఈ ఎన్నికల్లో పారలేదు. ఆయన మేనేజింగ్‌ స్కిల్స్‌ ఫ్యాన్‌ గాలి హోరులో సై‘కిల్‌’ కాకుండా కాపాడలేకపోయాయి. ఇక సామాజక మాధ్యమాల్లో టీడీపీ ఘోర ఓటమిపై మీమ్స్‌, సెటైర్స్‌ పేలుతున్నాయి. చంద్రబాబు పవర్‌ తగ్గలేదని కొందరు సెటైరికల్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఎక్కిడికెళ్లినా తన ప్రభావం చూపుతారని అంటున్నారు.

‘ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందని అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖేల్‌ ఖతమైంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయిపోయింది. ఆయన బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. ఆయన బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు.. మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ అడ్రస్ గల్లంతైంది. ఆయన అశోక్‌ గహ్లోత్‌తో తిరిగారు.. రాజస్తాన్‌లో సింగిల్ సీటు కూడా రాలేదు. ఆయన దేవగౌడతో భేటీ అయ్యారు.. ఫస్ట్ టైం ఓడిపోయారు. బాబు లెగ్ పవర్ అలాంటిది. పవర్‌ లేకున్నా లెగ్‌పవర్‌ తగ్గేది లేదు. తగ్గాల్సింది మనమే తమ్ముళ్లూ’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top