సుమలతకు కాంగ్రెస్‌ మద్దతు ఉండదు | Siddaramaiah Comments on Sumalatha Support in Congress | Sakshi
Sakshi News home page

సుమలతకు కాంగ్రెస్‌ మద్దతు ఉండదు

Mar 12 2019 8:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

Siddaramaiah Comments on Sumalatha Support in Congress - Sakshi

కర్ణాటక, శివాజీనగర :  ప్రస్తుత ఎంపీలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మైసూరు–కొడుగు నియోజకవర్గాల టికెట్‌ కేటాయింపు విషయంపై అధిష్టానం తనకు బాధ్యత అప్పగించిందని అన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు అప్పగించిన నేపథ్యంలో  అక్కడ కాంగ్రెస్‌ నుంచి సుమలత పోటీ చేయడం కుదరదని, ఒకవేళ ఆమె పోటీ చేసినా ఏ కాంగ్రెస్‌ నాయకుడు కూడా ఆమె మద్దతు ఇవ్వరని తెలిపారు.

సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున సుమలత పోటీ చేయటం లేదని, దీంతో  ఆదివారం డీకే.శివకుమార్‌ ఏర్పాటు చేసిన మండ్య జిల్లా కాంగ్రెస్‌ నాయకుల సమావేశానికి కొందరు నాయకులు వెళ్లారన్న విషయంపై తనకు తెలియదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశమై చర్చించామని, త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అంతేకాకుండా కాంగ్రెస్, జేడీఎస్‌కు ఎన్నిసీట్లు అనే విషయంపై కూడా నిర్ధారణ జరుగుతుందన్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చించామని, ఫైనల్‌గా నిర్ధారించటమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement