ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్సే | shobha karandlaje fired on siddaramaiah | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్సే

Jan 12 2018 7:23 AM | Updated on Jan 12 2018 7:23 AM

shobha karandlaje fired on siddaramaiah - Sakshi

బొమ్మనహళ్లి: దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీయేనని  బీజేపీ ఎంపీ శోభాకరందాజ్లే ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ఉగ్రవాదులు, జీహాదిలని ఆరోపించిన దినేష్‌ గుండూ రావు, సీఎం సిద్దరామయ్యలు తక్షణమే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరాలని  లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి జైల్‌భరో నిర్వహిస్తామన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ధైర్యం ఉంటే  తమను అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో శోభాకరందాజ్లే విలేకరులతో మాట్లాడారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపి కార్యకర్తలు చేతుల్లో తల్వార్‌లు,చాకులు పట్టుకోని తిరగలేదని అన్నారు. రాష్ట్ర హోం మంత్రి రామలింగారెడ్డి, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌గుండూరావు వ్యాఖ్యలతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. రాష్ట్రంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై ఉన్న కేసులను కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని గుర్తు చేశారు.  ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి సంఘటణలతో పొత్తు పెట్టుకోవాలని ముందుకెళ్లాలని యోచిస్తోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement