జగనన్న కోసం పనిచేస్తాం

Shiva Prasad Yadav Join In YSRCP Chittoor - Sakshi

భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన శివప్రసాద్‌ యాదవ్‌

వందలాదిగా తరలిచివచ్చిన యువకులు, మహిళలు

అంతకు ముందు భూమన ఇంటివరకు భారీ ర్యాలీ

హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య

తిరుచానూరు: ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తే శ్వాసగా పనిచేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తామంతా ఉంటామని యువకులు గొంతెత్తారు. వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు భూమన అభినయ్‌ సారథ్యంలో టీడీపీ బీసీ సెల్‌ నగర మాజీ అధ్యక్షుడు, వివేకానంద యూత్‌ అధ్యక్షుడు శివప్రసాద్‌ యా దవ్‌ సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఒక టో డివిజన్‌ అధ్యక్షుడు రాధారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు పద్మావతీపురం మెయిన్‌ రోడ్డు నుంచి ర్యాలీగా కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివప్రసాద్‌ యాదవ్‌ తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు.

కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నేడు ఆయన తనయుడు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం యువతకు ఆదర్శమన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న జగనన్న రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి, రోజుకు రెండు గంటలు పార్టీ కోసం పనిచేయాలని కోరారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యువత పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. వైఎస్‌ జగన్‌కు బాసటగా, కరుణాకరరెడ్డికి తోడుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు. నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కె బాబు, పాముల రమేష్‌రెడ్డి, తలారి రాజేంద్ర, మల్లం రవిచంద్రారెడ్డి, కృష్ణచైతన్య యాదవ్, వాసు యాదవ్, కట్టా గోపి యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, కేతం జయచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, మోహన్, నగర అధ్యక్షరాలు కుసుమ, లక్ష్మి, గీతా యాదవ్, రమణ మ్మ, సాయికుమారి, రాధ మాదవి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top