‘టీఆర్‌ఎస్‌ నాయకులను గ్రామాల్లోకి రానివ్వరు’ | Shabbir Ali Comments On KCR Over Early Elections | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ నాయకులను గ్రామాల్లోకి రానివ్వరు’

Aug 30 2018 5:31 PM | Updated on Oct 17 2018 6:10 PM

Shabbir Ali Comments On KCR Over Early Elections - Sakshi

శాసనమండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ

సాక్షి, నిజామాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించగానే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని శాసనమండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్దమేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి పనులు చెయ్యలేకే ముందస్తు ఎన్నికలకు వెళుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మిషన్‌ భగీరథ నీరు ఒక సంవత్సరంలో ఇస్తామని చెప్పి నాలుగున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో రూ. 69 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రూ. లక్షా 52వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో సునామీ వస్తుందన్నారు. తెలంగాణకు మొదట.. సీఎం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సారెస్సీ రైతులకు ఒక్క టీఎంసీ నీటిని విడుదల చెయ్యకుండా సీఎం అన్యాయం చేశారని మండిపడ్డారు. మొదటగా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ సీటు గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు.  

Advertisement
 
Advertisement
Advertisement