కోర్టుల్లో పోరాడతాం | Scams in EVMs in the current election | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో పోరాడతాం

Dec 15 2018 3:27 AM | Updated on Dec 15 2018 12:39 PM

Scams in EVMs in the current election - Sakshi

ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన మోసాలు, ఎన్నికల అధికారుల తీరుపై పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌ తెలిపారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రిట ర్నింగ్‌ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యి పోలింగ్‌ ఏజెంట్లను కూడా సెంటర్లలోకి రానివ్వకుండా టీఆర్‌ఎస్‌కు సహకరించారన్నారు. ఎన్నికల సంఘం, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ‘బ్రింగ్‌ బ్యాక్‌ పేపర్‌ బ్యాలెట్‌’ఉద్యమం హైదరాబాద్‌ నుంచి ప్రారంభిస్తామన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పోరాడతామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement