ఏపీలో ఫోన్ల ట్యాపింగ్‌; హైకోర్టులో వాదనలు

Sajjala Ramakrishna Reddy Filled Lunch Motion Petition Over YSRCP Leaders Phone Tapping Issue - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలయిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం మధ్యాహ్నం హై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హై కోర్టు తర్వాతి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

వైసీపీ నాయకులు ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ దాదాపు 13 మందిని ప్రతి వాదులుగా చేరుస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హై కోర్టులో పిటీషన్ వేశారు. దీనితో పాటు కీలక ఆధారాలను కూడా హై కోర్టుకు సమర్పించారు. కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కూడా ప్రతివాదులుగా చేర్చిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top