
సాక్షి, అనంతపురం: గుంతకల్లులో శనివారం నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. జనసేన నేతలు సమావేశం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు సమావేశంలోకి చొచ్చుకువచ్చారు. తమను ఎందుకు ఆహ్వానించలేదని సమావేశ నిర్వాహకులను నిలదీశారు. జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ అభిమానులు కుర్చీలు విరగొట్టారు. దీంతో సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది.