రాజస్తాన్‌: సచిన్‌ పైలట్‌కు హైకోర్టులో ఊరట

Rajasthan HC Order Not To Take Any Action On Dissident MLAs Till Friday - Sakshi

జైపూర్‌/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక రాజస్తాన్‌ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

కాగా, అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ శాసన సభా పక్షం రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దాంతో సచిన్‌ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం‌ నిర్ణయం తీసుకుంది. విప్‌ ధిక్కరణపై స్పీకర్‌ సీపీ జోషి వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారు.

(చదవండి: అసమర్థుడు.. పనికిరాని వాడు!)
(ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై మండిపడ్డ ఒమర్‌ అబ్దుల్లా)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top