పొత్తులపై రాహుల్‌ గాంధీ కీలక దిశానిర్దేశం

Rahul Gandi Suggestions to Telangana congress leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల కోసం తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో మహాకూటమిగా ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే, బద్ధ విరోధి అయిన టీడీపీతో అనైతిక పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం దిశానిర్దేశం చేశారు. పొత్తుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయించాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టు తెలిసింది. గెలువగలిగే స్థానాలను  ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ వదులుకోకూడదని ఆయన టీ కాంగ్రెస్‌ నేతలకు స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే రిపోర్టు ఉందని భరోసా ఇచ్చారు. నాయకులంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా  సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ అంశాలపై మీడియాకెక్కి నష్టం చేకూర్చే ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు. పార్టీ విజయం కోసం సమిష్టిగా పని చేయాలని, సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు ఇస్తానని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top