స్పీకర్‌ మోడ్‌ లేదా ఏరోప్లేన్‌ మోడ్‌ | Rahul Gandhi on bicycle leads protest march on petrol price in Karnataka | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ మోడ్‌ లేదా ఏరోప్లేన్‌ మోడ్‌

May 8 2018 2:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

Rahul Gandhi on bicycle leads protest march on petrol price in Karnataka - Sakshi

పెట్రో ధరలను నిరసిస్తూ మాలూరులో సైకిల్‌ తొక్కుతున్న రాహుల్‌

మాలూరు/దొడ్డబళ్లాపుర/హొసకోటె: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం వ్యంగ్య బాణాలు సంధించారు. ‘స్పీకర్‌ మోడ్‌’ లేదా ‘ఏరోప్లేన్‌ మోడ్‌’లో ఉండే మొబైల్‌ ఫోన్‌ వంటి వ్యక్తి మోదీ అనీ, ఆయన ఎప్పుడూ ‘వర్క్‌ మోడ్‌’లో ఉండరని రాహుల్‌ ఎద్దేవా చేశారు. సోమవారం రాహుల్‌ మాలూరు, హొసకోటె, దొడ్డబళ్లాపుర, దేవనహళ్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.

‘మాట్లాడటానికి మరో విషయమే లేనట్లు మోదీ ఎప్పుడూ తన ప్రసంగాల్లో నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుత సమస్యలపై కాకుండా కాంగ్రెస్‌ను, నన్ను దూషించడమే పనిగా పెట్టుకుని మాట్లాడతారు. ఆయన మాటల్లో ఎప్పుడూ మా పార్టీ వారిపై గౌరవం కనిపించదు’ అని పేర్కొన్నారు. పెట్రో ధరలు పెరిగిపోతుండటానికి నిరసనగా రాహుల్‌ గాంధీ కొద్ది దూరంపాటు సైకిల్‌ తొక్కి, మరికొద్ది దూరం ఎద్దుల బండిలో ప్రయాణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement