సీఎం రమేశ్‌ గడ్డం కోసమే పునాది రాయి వేస్తారా | Rachamallu Shiva Prasad Reddy Slams CM Ramesh And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం రమేశ్‌ గడ్డం కోసమే పునాది రాయి వేస్తారా

Nov 9 2018 12:52 PM | Updated on Nov 9 2018 12:52 PM

Rachamallu Shiva Prasad Reddy Slams CM Ramesh And Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ గడ్డం తీయడానికే సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తున్నారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రమేశ్‌ దీక్షా సమయంలో రెండు నెలల్లో పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తామని చెప్పారని, నిన్నటి ప్రొద్దుటూరు సభలో మరో నెల రోజుల్లో అని, కేబినెట్‌ మీటింగ్‌లో నెల రోజుల్లో అని ప్రకటించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో రాయలసీమలో తన ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు ఉక్కు కర్మాగారం కోసం పునాది రాయి వేయాలని నిర్ణయించాడే తప్ప, పరశ్రమపై చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక 16వ వార్డులోని ముస్లిం మైనారిటీ నాయకుడు దాదాపీర్‌ స్వగృహంలో బుధవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు.

పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విధి విధానాలను ప్రకటించాలని కోరారు. ఇందుకు అవసరమైన రూ.18వేల కోట్లు బడ్జెట్‌లో  పెట్టకుండా, భూ సేకరణ చేపట్టకుండా,  అవసరమైన ఖనిజం ఎలా వస్తుంది, నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియకుండా పరిశ్రమ పెట్టడం అంత సులువా అని అన్నారు. కుందూ–పెన్నా పథకానికి సంబం ధించి 400 ఎకరాల భూమిని సేకరించేందుకే 11 ఏళ్లుగా ప్రభుత్వానికి చేతకాలేదని, అలాంటిది వేల ఎకరాల భూమిని ఇప్పటికప్పుడు ఏవిధంగా సేకరిస్తారన్నారు. పండుగపూట కూడా పాతమొగుడేనా అన్న చందంగా దీపావళి రోజున కూడా ప్రజలు చంద్రబాబు అబద్ధాలను వినాల్సి వస్తోం దన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏమి చేశాయని ప్రశ్నిం చారు. తీరా ఎన్నికల ముందు పునాది రాయి వేసి ఈ ప్రాంత వాసులను మభ్యపెట్టడానికి జిల్లా ప్రజలు ఏమైనా అమాయకులా అని అన్నారు.

రమేశ్‌ కోసమే
ఉక్కు పరిశ్రమ పేరుతో 11 రోజులపాటు సీఎం రమేశ్‌ ద్రవ రూపంలో ఆహారం తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఆ ప్రకా రం ఆయన గడ్డం మూరెడు అయి, బారెడు పెరుగుతుందని ప్రస్తుతం పునాది రాయి వేస్తున్నారన్నారు. సీఎం రమేశ్‌ కేశఖండన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడానికి టీడీపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. రూ.వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తారని, ఇన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఆర్థిక గణాంకాలు వేసి అందరిని భ్రమలో పెట్టే ప్రయత్నమే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఈ నాటకాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. సమావేశంలో వార్డు ఇన్‌చార్జి పాపిగారి నాగసుబ్బారెడ్డి, మార్కెట్‌ జాఫర్, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, ఆటో నగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నన్నే సాహెబ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement