పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదు

Purighalla Raghuram Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని బీజేపీ అధికార ప్రతినిధి పి. రఘురాం ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరాశ నిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, కన్నా లక్ష్మీనారాయణల మీద టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా చంద్రబాబు ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే ఉన్నారని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు మాత్రం ఒడిపోతామనే భయంతో రహస్య పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు.


బీజేపీ నాయకుడు పి. రఘురాం

పవన్ కళ్యాణ్‌, జనసేన పార్టీ సీఎం చంద్రబాబు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్, కెఏ పాల్ లాంటి వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్‌ కాపీలు తయారు చేసి ఇస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనని అన్నారు. విశాఖపట్నం  నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలో సిన్సియారిటీ లేదన్నారు. చంద్రబాబు సలహాతోనే ఆయన జనసేన పార్టీలో చేరారని రఘురాం తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top