శ్రీవారి సేవాభాగ్యం దక్కడం అదృష్టం | Prudhvi Thanks to YS Jagan For SV Channel Chairman Post | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవాభాగ్యం దక్కడం అదృష్టం

Aug 5 2019 9:08 AM | Updated on Aug 5 2019 9:08 AM

Prudhvi Thanks to YS Jagan For SV Channel Chairman Post - Sakshi

మాట్లాడుతున్న ఫృథ్విరాజ్‌

పంజగుట్ట: తనపై నమ్మకంతో ఎస్వీ భక్తి చానల్‌ చైర్మన్‌గా నియమించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటానని, కలలో కూడా శ్రీవారి సేవ చేసే భాగ్యం వస్తుందని అనుకోలేదని వై ఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, నటుడు పృథ్విరాజ్‌ అన్నారు. చైర్మన్‌గా చానల్‌ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు విస్తరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజు, గత నెల 28న స్వామి వారి సన్నిధిలో ఎస్వీ భక్తి చానల్‌ చైర్మన్‌గా ప్ర మాణ స్వీకారం చేసిన మధురక్షణాలు మరవలేనివన్నారు. చానల్‌లో పనిచేసే ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావించి చైర్మన్‌ సంప్రదాయాన్ని మారుస్తానన్నారు. చానల్‌ లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులు పర్మినెంట్‌ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. తా ను అమరావతికి వస్తే తమ పార్టీని, నాయకుడిని విమర్షించే వారిపై మాటల తూటాలు కొనసాగుతాయన్నారు. అక్కడ స్వామి విధేయుడిగా, ఇక్కడ పార్టీ విధేయుడిగా కొనసాగుతానన్నారు. చానల్‌లో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు పోసానికి మధ్య విబేధాలు ఉన్నాయన్న దాంట్లో వాస్తవం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement