గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించాలని నిరసన | Protest to remove the pink robe | Sakshi
Sakshi News home page

గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించాలని నిరసన

Jun 2 2018 10:57 AM | Updated on Oct 8 2018 5:19 PM

Protest to remove the pink robe - Sakshi

అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతున్న నాయకులు

నెహ్రూసెంటర్‌(మహబూబాబాద్‌) : మానుకోట కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్థూపానికి చుట్టిన గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించి, తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలని టీజేఎస్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం స్థూపం వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు కాగా ఏర్పాటు చేసుకున్న స్థూపానికి టీఆర్‌ఎస్‌ పార్టీ రంగు అయిన గులాబీ వస్త్రాన్ని చుట్టి అవమానించారని ఆరోపించారు. ఉద్యమకారులు భూక్య సత్యనారాయణ బెజ్జం ఐలయ్య పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement