ప్రజా ఫ్రంట్‌ మేనిఫెస్టో విడుదల

Praja Front Manifesto released - Sakshi

ఆవిష్కరించిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రజా మేనిఫెస్టో’ను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు నలమాస కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బు సంపాదిం చుకునేందుకు మార్గంగా మారాయని ఆరోపిం చారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి ఎన్నికల్లో గెలవడం, డబ్బు సంపాదించడం పరి పాటిగా మారాయన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజల కోర్కెలు తీర్చే ప్రభుత్వం వస్తుందని భావించామన్నారు. గత ప్రభుత్వాలు కనీసం మాట్లాడే హక్కునైనా ఇచ్చాయని, ఈ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు వచ్చే నాయకులను ప్రశ్నించేందుకు ఫ్రంట్‌ మేనిఫెస్టో రూపొందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ.. ఎన్నికలు ధనికులకు క్రీడ ల్లా అయ్యాయని, అందులో విజయం సాధిం చిన ఏ నాయకుడూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఉద్యమాల ఉపాధ్యాయు డు సాంబశివరావు మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం తెలంగాణ తీసుకువస్తే స్వగృహ పరి పాలన అయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ పద్మజాషా, వివిధ సంఘా ల నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top