breaking news
telangana prajafront
-
ప్రజా ఫ్రంట్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రజా మేనిఫెస్టో’ను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బు సంపాదిం చుకునేందుకు మార్గంగా మారాయని ఆరోపిం చారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి ఎన్నికల్లో గెలవడం, డబ్బు సంపాదించడం పరి పాటిగా మారాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజల కోర్కెలు తీర్చే ప్రభుత్వం వస్తుందని భావించామన్నారు. గత ప్రభుత్వాలు కనీసం మాట్లాడే హక్కునైనా ఇచ్చాయని, ఈ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు వచ్చే నాయకులను ప్రశ్నించేందుకు ఫ్రంట్ మేనిఫెస్టో రూపొందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ.. ఎన్నికలు ధనికులకు క్రీడ ల్లా అయ్యాయని, అందులో విజయం సాధిం చిన ఏ నాయకుడూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఉద్యమాల ఉపాధ్యాయు డు సాంబశివరావు మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం తెలంగాణ తీసుకువస్తే స్వగృహ పరి పాలన అయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పద్మజాషా, వివిధ సంఘా ల నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘రామోజీ ఆక్రమించిన భూములు పంచాలి’
హుస్నాబాద్: రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల మిగులు భూములుండగా.. వాటిని రామోజీరావుతో పాటు పలువురు ఆక్రమించుకున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు వేదకుమార్ ఆరోపించారు. ఈ భూములను సర్కారు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వనరులను కాపాడుతామని చెప్పిన పార్టీలు..వాటిని దోచుకునేవారికి టికెట్లు ఇచ్చాయన్నారు. దేశంలో ఏడువందల మంది నేరస్తులు ఎంపీలుగా పోటీ చేస్తున్నారని, ఇందులో రెండు వందల మంది కార్పొరేట్లు ఉన్నారని, ఇలాంటి వారు గెలిస్తే వనరులను మరింతగా దోచుకుంటారని అన్నారు. సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదానికి మద్దతు తెలిపినప్పటికీ జేఏసీ ఎందుకు మాట్లాడం లేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత జేఏసీ ఎందుకని ప్రశ్నించారు. ఆదివాసులను ముంచుతున్న పోల వరం ప్రాజెక్టును నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకురాలు దేవేంద్ర పాల్గొన్నారు.