
సాక్షి, హైదరాబాద్: రైల్వేలు, రైల్వేస్టేషన్లను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ఈ దేశ పతనానికి నాంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులను ప్రైవేట్‌పరం చేసిన బీజేపీ ప్రభుత్వం చివరకు 151 రైల్వేస్టేషన్లను కూడా ప్రైవేట్‌కు అప్పగిస్తామనడం దుర్మార్గమైన చర్య అని బుధవారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ఇది అం బానీ, ఆదానీల ప్రభుత్వమని విమర్శించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.