టీడీపీ ఎంపీల డ్రామా బట్టబయలు!

Piyush Goyal Media Chit Chat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాలు మరోసారి బయటపడ్డాయి. ఏపీ రైల్వేజోన్‌ కోసం తనను కలవలేదని రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీడీపీ ఎంపీలను తాను కలవలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఎంపీలందరినీ కలుస్తుంటానని, టీడీపీ ఎంపీలెవరూ తనను అపాయింట్‌మెంట్ అడగలేదని చెప్పారు.

పరిశీలనలో ఉంది
ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని లేదని, కేవలం పరిశీలించాలని మాత్రమే పెట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైల్వేజోన్ పరిశీలనలో ఉందని.. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలను పర్యవసనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జోన్‌పై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

ఒడిశా ఎంపీలతో అలా అనలేదు
‘ఏపీకి రైల్వేజోన్ ఇవ్వడం లేదని బీజేడీ ఎంపీలతో చెప్పలేదు. ఒడిశా ఎంపీలు వారి రాష్ట్రంలో మూడు కొత్త డివిజన్‌లు అడిగారు. అవి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పాను. ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటు చేయలేమని ఒడిశా ఎంపీలతో చెప్పలేదు. వారు మీడియాతో అలా చెప్పితే అబద్ధాలు ఆడుతున్నట్టేన’ని పియూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top