
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి యత్నం జరిగింది. ఆదివారం ఉదయం పెట్రోల్ బాంబుతో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో బాంబు అదే కారులో పేలిపోగా.. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని ఇటీవలె దినకరన్ పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్‌పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటికి చేరుకుని బాంబు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో కారులో బాంబును తీసుకుని ఆదివారం దినకరన్ ఇంటి వద్దకు పరిమళం చేరుకున్నాడు. ఆ సమయంలో బాంబు అదే కారులో పేలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.