‘పవన్‌ కల్యాణ్‌ నాటకాలాడుతున్నాడు’  | Pavan Kalyan Playing Dramas | Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌ నాటకాలాడుతున్నాడు’ 

Mar 20 2018 2:25 PM | Updated on Jul 6 2019 3:48 PM

Pavan Kalyan Playing Dramas - Sakshi

పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని నాటకాలాడినా చేసేదేమి లేదని  టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

సాక్షి, అమరావతి : పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని నాటకాలాడినా చేసేదేమి లేదని  టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా పాచి పోయిన లడ్డూ అన్న పవన్‌ నేడు ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం అంటున్నాడని విమర్శించారు. బీజేపీ స్క్రిప్టుకు అనుగుణంగా పవన్‌ నటిస్తున్నాడని విమర్శించారు.

దమ్ముంటే పోలవరంలో అవినీతి జరిగిందని పవన్‌ చేసిన ఆరోపణల్ని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు.ఉద్దేశ్ పూర్వకంగానే పవన్‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ సమావేశాలకు పవన్‌ హాజరవుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement