ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్‌ పోలింగ్‌..

Parishad Election Polling Continues Peacefully - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి రెండుగంటల్లో 19 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top